హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్వరలో విడుదల కాబోతున్న బృందావనం చిత్రాన్ని అడ్డుకుంటామని హిందూ జన జాగృతి హెచ్చరించింది. బృందావనం చిత్రంలో హిందువుల ఆరాధ్య దైవం కృష్ణుడిని కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, వాటిని వెంటనే తీసేయాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. లేదంటే ఆన్ లైన్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని ఆ చిత్రానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని తెలిపారు.
సినిమాలో కొన్ని దృశ్యాలపై యాదవులు భగ్గుమంటున్నారు. శ్రీకృష్ణ భగవానుడిని అవమానించే విధంగా సినిమాలో కొన్ని దృశ్యాలున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలను తొలగించాలని వారు పట్టుబడుతున్నారు. లేదంటే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. బృందావనం సినిమా ఈ నెల 14వ తేదీన విడుదల కావాల్సి ఉంది.

0 Response for the "ఎన్టీఆర్ బృందావనం చిత్రాన్ని అడ్డుకుంటాం: హిందూ జన జాగృతి"
Post a Comment