ఎన్టీఆర్, మెహర్ రమేష్,అశ్వనీదత్ కాంబినేషన్ లో రూపొందుతున్న శక్తి చిత్రం ప్రస్తుతం కులుమనాలీ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఆగస్టు 5 వరకూ ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. అలాగే బాలీవుడ్ నటి పూజా బేడీ ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తోంది.చిత్రంలో ఆమె ఓ ఈజెప్టు వనితగా దర్శనమివ్వనుంది.అలాగే జాకీష్రాఫ్, సూద్ విలన్స్ గా కనిపించనున్నారు. ఓ అడ్వంచరస్ ఫాంటసీగా రూపొందే ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొత్త గెటప్ లో కనిపించి ఫైట్స్ వంటివి విభిన్నంగా చేయనున్నాడని చెప్తున్నారు. వైజయింతి మూవీస్ పతాకంపై ఇదే కాంబినేషన్ లో ఇంతకుముందు కంత్రి చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు అందిస్తూంటే,సమీర్ రెడ్డి కెమెరా, ఆనందసాయి..కళ, ఎడిటింగ్..మార్తాండ్ కె వెంకటేష్,సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.
అలాగే ఈ 'శక్తి' చిత్రం టోటల్ బడ్జెట్ 45 కోట్లు అని సమాచారం. ఓ ప్రక్క బడ్జెట్ తగ్గించాలి, కాస్ట్ కట్టింగ్ అని నిర్మాతల మండలి మొత్తుకుంటున్న నేపద్యంలో ఈ బడ్టెట్ తో చిత్రం చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఈ చిత్రం ఫాంటసీ ఎలమెంట్స్ కలిసిన కథగా ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. అశ్వనీదత్...తమ వైజయింతి బ్యానర్ పై తీస్తున్న ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడుతోంది. అలాగే సీనియర్ రచయిత సత్యానంద్ ఈ చిత్రానికి మాటలు సమకూరుస్తున్నారు. ప్రసిద్ధ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, సీనియర్ రచయిత జె.కె.భారవి, 'వరుడు', 'ఆరెంజ్' చిత్రాల ఫేమ్ తోట ప్రసాద్, 'సారాయి వీర్రాజు' దర్శకుడు డి.ఎస్.కన్నన్ స్క్రిప్టు వర్క్ లో పాలుపంచుకుంటున్నారు.
Categories:
Subscribe to:
Post Comments (Atom)
0 Response for the "ఎన్టీఆర్, మెహర్ రమేష్ ల తాజా చిత్రం 'శక్తి' లేటెస్ట్ ఇన్ఫో"
Post a Comment